PM Narendra Modi pays tribute to Sardar Vallabhbai Patel : Watch Video
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లో మంగళవారం ఉదయం ‘ఐక్యతా పరుగు’ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పరుగును ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జెండా వూపి ప్రారంభించారు. ప్రధాని, హోంమంత్రితోపాటు ప్రముఖ క్రీడాకారులు కరణం మల్లేశ్వరి, దీపా కర్మాకర్, రైనా, సర్దార్‌సింగ్ జెండా వూపారు.
ఇక అనంతరం ధ్యాన్‌చంద్ స్టేడియంలో కార్యక్రమానికి తరలివచ్చిన వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. పటేల్ వారసత్వాన్ని గత ప్రభుత్వాలు తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయి. . చరిత్రలో వారి సేవలను తుడిచిపెట్టేందుకు లేదా ప్రాధాన్యతలను తగ్గించే యత్నంలో భాగంగానే ఇలా నిర్లక్ష్యం చేశారు. ఓ రాజకీయ పార్టీ పటేల్‌ను పితామహుడిగా భావించినా, భావించకపోయినా... దేశ యువత ఆయనను మరిచిపోయేలా మాత్రం చేయకూడదు. అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.కాగా పటేల్ జయంతి సందర్భంగా ఇవాళ దేశమంతటా ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లిలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహం వద్ద రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు నివాళులు అర్పించారు. ‘‘స్వాతంత్ర్యానంతరం దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు పటేల్ చేసిన కృషి అమోఘనీయం. భారతదేశం భిన్న మతాల, సంస్కృతుల సమ్మేళనం.